కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగింది.. నవదీప్‌

కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని సినీ నటుడు నవదీప్‌ అన్నారు.

పాస్ట్‌ఫుడ్‌, పాస్ట్‌పుడ్‌ అంటూ పాస్ట్‌గా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొత్త ఆర్కాకేఫ్‌లో ఏర్పాటు చేసిన ద లిటిల్‌ విలేజ్‌ షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు.సేంద్రియ ఎరువులతో పండించిన పంట ఉత్పత్తులతో ఆహార పదార్థాలతో పాటు సాంప్రదాయ గిరిజన తెగలకు సంబంధించిన ఉత్పత్తులకు మార్కెంటింగ్ కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

Corona Has Raised Awareness About Health For Everyone. Navdeep‌, Navdeep‌ ,

గిరిజన తెగలు తయారు చేసిన కళాత్మక ఉత్పత్తులను ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు సహజసిద్ధంగా పండించిన పంట ఉత్పత్తులన్నీ ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో ద లిటిల్‌ విలేజ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు