కాంగ్రెస్ పార్టీలో వరుస చేరికలు....

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రోజున బుగ్గ రాజరాజేశ్వర ఆలయ చైర్మన్ అల్లూరి రాజారెడ్డితో పాటు బిజెపి సీనియర్ నేతఅల్లూరి వెంకట్ రెడ్డి( Alluri Venkat Reddy ) రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పలువురు రైతులు, యువకులు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సంతోశంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మనం అందరం గెలుపులో భాగస్వామ్యం అవ్వాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో( Congress Party Manifesto ) ఇంటింటికి తెలపాలని సూచించారు.మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా 100 రోజుల్లో అమలుపరిచాం.

కాంగ్రెస్( Congress Party ) మాట ఇస్తే తప్పక ఇప్పుడున్న కేంద్రం గ్యాస్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులకు భారాన్ని మోపుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియమకాలు అని దళితులకు మూడెకరాలని, ఉద్యోగాలని, ఉచిత విద్య అని నమ్మించి మోసం చేసిందన్నారు.

రానున్న కాంగ్రెస్ హయాంలో ప్రజలందరికీ మెరుగైన సేవలను అందిస్తామని అన్నారు.మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ చేస్తామని మాది మాటల ప్రభుత్వం కాదు చేసి చూపిస్తామన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తూము జలపతి, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్ , గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ,బీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ నాయకులు చేలుకల తిరుపతి , పల్లి గంగాధర్ ,గడ్డం శ్రీను, దయ్యాల శ్రీను, పరందాములు,దాసు,పిడుగు లచ్చిరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నరు.

Advertisement

Latest Rajanna Sircilla News