చిత్తూరు జిల్లాలో ఏనుగుల స్వైరవిహారంతో తీవ్ర కల్లోలం చెలరేగింది.ఈ మేరకు రామకుప్పం మండలంలో సంచరిస్తున్న గజరాజులు గొల్లపల్లిలో తిష్టవేశాయి.
గొల్లపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న రెండు ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావడంతో పాటు పంటలు నాశనం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు స్పందించి తమను, తమ పంటలను ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.అయితే ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.