గులాబీ గూటికి చెరుకు సుధాకర్...?

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి సారి పిడి యాక్ట్ అనుభవించిన ఉద్యమకారుడు, అందరికంటే ముందే కేసీఆర్ తో విభేదించి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించి, అటు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరి టీపీసీసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్, కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి, నేడు బీఆర్‌ఎస్‌లో చేరనున్నాన్నారని తెలుస్తోంది.

శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల భూస్వామ్య ఆధిపత్య ధోరణి తీవ్రంగా బాధిస్తున్నాయంటూ, ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ, ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం చేయలేనని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్‌ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ మాటల్లో తప్ప ఆచరణలో లేదని విమర్శించారు.

ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ చివరకు మోసం చేసిందని దుయ్యబట్టారు.బీసీలకు కేటాయించిన 12 సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాలేదని చెప్పారు.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..
Advertisement

Latest Nalgonda News