6 గ్యారెంటీలతో జోష్ లో ఉన్న కాంగ్రెస్...!

సూర్యాపేట జిల్లా:కోదాడ(Kodad ) అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ప్రచారం జోరు అందుకుంది.రోజురోజుకు ప్రజా ఆదరణ పెరుగుతూ చేరికలతో దూసుకుపోతుంది.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను గడపగడపకు తీసుకెళుతూ పద్మావతి రెడ్డి ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు.బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు( Chander Rao Venepalli ) అధ్వర్యంలో కొత్త పాత కలయికతో చేరికలు భారీగా కొనసాగుతున్నాయి.

Congress In Josh With 6 Guarantees , Kodad , Chander Rao Venepalli ,Uttam Padma

ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలుహస్తం గూటికి చేరుతున్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి( Uttam Padmavathi reddy ) గెలుపుపై ధీమా ఉన్నారు.

సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆడపడుచులకు,నిరుపేద కుటుంబాలకు, యువకులకు,నిరుద్యోగుల కోసమేనని,కోదాడలో, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Latest Suryapet News