బి.పి.ఇ.డి రాష్ట్రస్థాయి పరీక్షలో 36వ ర్యాంక్ సాధించిన పెద్దూరి రమ్యకు సత్కారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించటం అభినందనీయమనీ గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య( Pedduri Ramya ) అంచెలంచెలుగా వాలీబాల్ పోటీలలో జిల్లానుండి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడాకారిణిగా రాణించడంతోపాటుగా బి.

పి.

ఇ.డి రాష్ట్రస్థాయి పరీక్షలో 36వ ర్యాంక్ సాధించడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసరవేణి పర్శరాములు అన్నారు.బుధవారం ఎల్లారెడ్డిపేట( Yellareddypet )లో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో బి.పి.ఇ.డి 2023లో 36 ర్యాంక్ సాధించిన పెద్దూరి రమ్యను శాలువా తో సన్మానించి , ప్రశంసాపత్రంతో సన్మానించారు.పెద్దూరి రమ్య వాలీబాల్ క్రీడలో పిబ్రవరి 2023లో అస్సాం ,రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచినదనీ,రాష్ట్ర స్థాయి పోటీలలో 16 సార్లు, జాతీయ స్థాయిలో 3సార్లు పాల్గొని క్రీడా ప్రతభను చూపడం అభినందనీయమని అన్నారు.

అలాగే పెద్దూరి రమ్యకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు వారి గురువులు బైరగోని అనిల్ ని సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్, గజభీంకార్ అజయ్, గ్రాడ్యుయేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిలుముల జయవర్ధన్, ఉపాధ్యాయులు రాచర్ల వెంకన్న, డి.సంజీవ్ కుమార్, బైరగోని అనిల్, కనపర్తి జగదీశ్వర్, పెద్దూరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News