నటుడు నరేష్( Naresh ) చాలామంచి నటుడు అనే విషయం మనకు తెలిసిందే…నరేష్ హీరోగా, పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) హీరోయిన్ గా నటించిన సినిమా మళ్లీ పెళ్లి.ఈ సినిమా నరేష్ తన రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తీయడం జరిగింది.
ఈ సినిమా నిర్మాతగా నరేష్ వ్యవహరించారు.అయితే నరేష్ ఈ సినిమాతో తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటన కారణాలు వాటిని ఆడియన్స్ అర్థం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించినట్టుగా అనిపించింది.
ఎందుకు నిర్మించినప్పటికీ.సినిమా అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసింది గాని.
థియేటర్స్ లో మాత్రం అస్సలు ఆదరణ పొందలేకపోయింది.మళ్లీ పెళ్లి సినిమాతో నరేష్ కి చాలా నష్టం అయితే మాత్రం వచ్చిందని తెగ వార్తలు వచ్చాయి…
సినిమాని ఏ రూపంలోని ఆడియన్స్ అంగీకరించలేదు అంటే అర్థం.ఆయన రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలను కూడా ఆడియన్స్ పెద్దగా ఓన్ చేసుకోలేదని అర్థమవుతుంది.ఇవన్నీ పక్కన పెడితే.
మళ్లీ పెళ్లి సినిమా హాల్స్ లో నుంచి చాలా తొందరగా పోయినప్పటికీ.ఓటీటీ లో అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video )లో ఈ సినిమాని ఇవ్వడం జరిగింది.
అయితే మళ్లి పెళ్లి సినిమా స్టీమింగును అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి తొలగించేసింది.
దానికి కారణమైతే లేకుండా పోలేదు.మళ్ళీ పెళ్లి సినిమా ఆహా యాప్ లోనూ మరియు అమెజాన్ ప్రైమ్ లో కూడా జూన్ 23న రిలీజ్ అయింది.అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇప్పుడు లేదు తొలగించేశారు…
దర్శకుడు ఎమ్మెస్ రాజు( M.S.Raju ) ఈ సినిమాని నరేష్, పవిత్ర లోకేష్ చెప్పిన వాళ్ల పర్సనల్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తీసుకొని ఆయన ఈ సినిమా కథ రాసి దర్శకత్వం వహించడం జరిగింది.ఈ సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో వినూత్నమైన ధోరణిలో.
ఆ సంఘటన నిజంగా జరిగాయేమో నరేష్ కి నిజంగా పెళ్లి జరిగిందేమో అన్నట్టుగా ఎన్నో రకాలుగా ప్రమోషన్స్ అయితే చేశారు కానీ.ఎన్ని చేసినా కూడా ఆడియన్స్ కి మాత్రం థియేటర్ దగ్గరికి రప్పించలేకపోయారు.
అలాగే ఇప్పుడు కనీసం ఓటీటీ లో అయినా.అందరికీ రీచ్ అవుతుందనుకుంటే.
ఇప్పుడు ఇలాంటి లీగల్ ఇష్యూస్ వలన అమెజాన్ ప్రైమ్ నుంచి కూడా మళ్లీ పెళ్లి రిమూవ్ చేయాల్సిన పరిస్థితి రావడం.నిజంగా ఆ సినిమా టీం వాళ్లకి బాధాకరమనే అనుకోవాలి…
.