క్రీడారంగంలో కొనసాగుతున్న కీచక పర్వాన్ని అంతమొందించండి

నల్లగొండ జిల్లా:మహిళా రెజ్లర్లపై( Wrestlers ) లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భ్భూషణ్ ను అరెస్టు చేయాలని కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ ( Comrade JSR )బహిరంగ లేఖ రాశారు.

అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలంపిక్స్, కామన్వ్వెల్త్,ఏషియన్ గేమ్స్ తదితర పోటీలలో గోల్డ్,సిల్వర్,బ్రాంజ్ పతకాలను సాధించి భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేసిన మహిళా మల్లయోధులు (రెజ్లర్స్)వారు!అంతర్జాతీయ వినువీధులలో దేశపతాకాన్ని రెపరెపలాడించిన అగ్రశ్రేణి క్రీడాకారులు !!మన ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా పెంచిన వారు నేడు న్యాయం కోసం ఢిల్లీ రోడ్లపైకి వచ్చి న్యాయం కావాలని ఆక్రోషిస్తున్నారు.

తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆలిండియా రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్( Brij Bhushan ) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మద్దతు పలుకుదామా? మౌనం వహిద్దామా? అని పౌర సమాజాన్ని సుభాషన్న ప్రశ్నించారు.కంచె చేను వేసినట్టు,రక్షకుడే బచ్చకుడైనట్టు,తమను కాపాడి,అండగా ఉండవలసిన డబ్లూఎఫ్ఎస్ఐ అధ్యక్షుడే తమపై లైంగిక వేధింపులు సాగిస్తున్నాడని 2016లోనే ఈ మహిళా మల్లయోధులు రిపోర్టులు చేసినా చర్యలు లేవనే కారణంగా 2023 జనవరిలో ఢిల్లీలో ధర్నా చేపట్టారు.

Comrade JSR Comments On Brij Bhushan , Central Govt , Wrestlers , Brij Bhushan

కమిటీ వేసి విచారణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నాడు ధర్నాను విరమించారు.కేంద్రం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్టు ఇచ్చింది.ఆ రిపోర్టును ప్రభుత్వం బయట పెట్టలేదు.

రహస్యంగా తొక్కిపెట్టింది.బ్రిజ్ భూషణ్ పై ఎలాంటి చర్య తీసుకోలేదు.

Advertisement

తాము దేశానికి పతకాలు సాధించినపుడు అభినందనల పేరుతో తన నివాసానికి పిలుపించుకొని ఫోటోలు దిగి ప్రచారం సాగించుకునే ప్రధాని మోదీ,ఇప్పుడువారి గోడు పట్టించుకోకుండా మౌనంగా ఎందుకు ఉన్నాడని నిలదీశారు.పైగా నేరస్తులకు ప్రత్యక్ష మద్దతు కేంద్రం ఎందుకు అందిస్తున్నదన్నారు.

అందుకే 7గురు మహిళా రెజ్లర్లు (ఇందులో ఒకరు మైనరు) బ్రిజ్ భూషణ్ పై పోలీసు కేసు పెట్టారు.కాని, కేంద్రం ఒత్తిడితో ఎఫ్ఐఎస్ఆర్ కూడా నమోదు కాలేదు.

బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే కానీ, ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు.కానీ,చర్యలు శూన్యం.

ఈ స్థితిలో రెండవసారి ఏప్రిల్ 23 నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక ధర్నాకి ఉపక్రమించారు.కొంత మంది ఇతర రంగాల అంతర్జాతీయ క్రీడాకారులు వీరికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించి ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

విద్యార్థి,యువజన, మహిళ సంఘాలు మద్దతిస్తున్నాయి.వివిధ రాజకీయ ప్రముఖులు వారి పోరాటానికి అండగా నిలిచారు.

Advertisement

బేటి బచావో బేటీ పడావో అంటూ నిత్యం నినదించే దేశ ప్రధాని మోదీ మాటలు ఎంత బుటకమో మహిళా రెజ్లర్ల సమస్యలు మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు.న్యాయవ్యవస్థలోని సీనియర్ న్యాయమూర్తులను లొంగదీసుకోవడానికి వారిపై కొందరు మహిళలు పిర్యాధులు చేసినపుడు ఎంత వేగంగా కేంద్రం స్పందించిందో వారు కేంద్రానికి గులాంగిరికీ అంగీకరించగానే అంతే వేగంగా కేసులను కేంద్రం పక్కదారి పట్టించింది.

కాశ్మీర్లో కధువా గ్రామం గర్భగుడిలో ఒక బాలికను నిర్భందించి రోజుల తరబడి అత్యాచారం చేసి చంపిన నిందితులను కాపాడుటకు కేంద్రం,బీజేపీ అగ్రనాయకత్వం ఎలా వేనుకేసుకొని వచ్చిందో చూశాం.హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ నేపధ్యం గల రేపిస్టులను,యు.

పిలోని ఉన్నావ్లో అత్యాచారానికి ఒడిగట్టిన బీజేపీ ఎమ్మెల్యేని రక్షించడానికి బీజేపీ,కేంద్ర ప్రభుత్వం నిసిగ్గుగా వ్యవహరించింది.ఇలా స్త్రీలను రెండవ తరగతి పౌరులుగా హీన దృక్పధంతో చూసే మనువాద పాలకులకు ఈ మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల సమస్య అసలు సమస్యగానే కనిపించక పోవడం ఆశ్చర్యం కాదు.

పని ప్రదేశాలల్లో, కార్ఖానాలలో, పరిశ్రమలలో,ఆఫీసులలో ఇలా ప్రతిచోట మహిళలపై అధికార్ల లైంగిక వేధింపులకు గురౌతున్నారనేది ఒక వాస్తవం.ఈ జాడ్యానికి క్రీడా రంగం కూడా మినహాయింపు కాదు.

ఈ మహిళా రెజ్లర్ల కాలక్షేపం కోసం ధర్నా చేయడం లేదు.దేశానికి బంగారు పతకాలతో ఎంతో కీర్తి ప్రతిష్టలు అందించారు, అర్జించారు.

తమ అలవెన్సులు పెంచాలని ఆందోళనలు చేయడం లేదు.లైంగిక వేధింపులపై చర్యలు కోరుతున్నారు.

న్యాయం కోరుతున్నారు ఎందరో మహిళలు ఇలాంటి వేధింపులను సిగ్గుతో,సమాజానికి బయపడి బయటకు చెప్పలేక కృంగిపోతున్నారు.తమ ఆశయాలను, లక్ష్యాలను చేరుకోలేక మనోవ్యధితో విఫలమౌతున్నారు.

ఈ స్థితిలో సమాజం మీద నమ్మకంతో అంతకు మించిన ధైర్యంతో మహిళా రెజ్లర్లు ఈనాడు బహిరంగంగా న్యాయం కోరుతూ మన ముందుకు వచ్చారు.మన మద్దతు కోరుతున్నారు.

వారికి సమస్త సమాజం అండగా నిలవాలని అభ్యుదయ వాది కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.భారతమాతాకి జై అని నినదిస్తూనే దేశం నలుమూలల నిత్యం భారతమాతలనే మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు ఒడిగడుతున్న నిందితులను కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

క్రీడారంగంలో కీచక పర్వం లైంగిక వేధింపుల ఆరోపణలతో రాజుకున్న మల్లయోధుల ఆందోళన ఇప్పుడు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద రోజురోజుకు ప్రజ్వరిల్లుతోందని,చలిని ఎండను లెక్కచేయకుండా రెజ్లర్లు పట్టుదలగా కొనసాగిస్తున్న ధర్నాకు ఎంఎల్ పార్టీ కార్యదర్శి జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మద్దతు ప్రకటించారు.నైతిక మద్దతు తెలిపిన ప్రజాతంత్ర ఉద్యమకారుడు జై బోరన్న గారి నేతాజీ సుభాష్ అన్న- భారత మల్లయోధుల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎస్ఐ) సారథి బ్రిజ్ భూషణ్ ను 15 రోజుల గడువులో అరెస్టు చేయకపోతే ఏమవుతుందో కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అనేక ప్రజా సంఘాలు ఇప్పటికే హెచ్చరికలు చేసిన విషయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని జెఎస్ఆర్ కోరారు.

రైతు వ్యతిరేక చట్టాలపై మడమ తిప్పని పోరాటం సాగించిన సంయుక్త కిసాన్ మోర్చా బాసట లభించిన దరిమిలా రెజ్లర్ల శిబిరంలో కదనోత్సాహం పరుగులు పెడుతుంది.గత జనవరిలో వినేశ్ ఫోగాట్ బృందం-మహిళా అథ్లెట్లు శారీరకంగా మానసికంగా ఎలా వేధింపులు పాలబడుతున్నారో నివేదించినప్పుడు అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టడమే ధర్నాకు దారి తీసింది.

వివాదాంశం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ దృష్టికి వెళ్ళాక కమిటీ ఏర్పాటు యోచన తెరపైకి వచ్చింది.మేరీకోమ్ సారథ్యంలోని కమిటీ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం, బ్రిజ్ భూషణ్ కుర్చీ దిగకపోవడంతో కోపితులైన రెజ్లర్లు మూడునెలల విరామానంతరం తిరిగి ధర్నా బాట పట్టడంతో- పరిస్థితి మొదటికి వచ్చింది.

వీధుల్లో పోరాటం దేశ ప్రతిష్ఠకు భంగకరమన్న ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష వ్యాఖ్యలు,అర్ధరాత్రి వేళ పోలీసు జులుం- ఇరువర్గాల మధ్య అంతరం పెంచేశాయి.నిజానికి కామన్వెల్త్ పోటీలు,ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లు న్యాయంకోసం వీధులకు ఎక్కాల్సి రావడం,ఇంత జరుగుతున్నా కళంకిత నేత పదవి పట్టుకుని వేళ్లాడుతుండటం జాతికే తలవంపులు.

స్త్రీని మాతృ స్వరూపంగా పరిగణించి, దేవతాంశగా సంభావించే భారతీయ సంస్కృతికి తీరని అప్రతిష్ఠ వాటిల్లజేస్తూ ఇక్కడ అటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.సుమారు మూడున్నరేళ్ల క్రితం పదిహేనేళ్ల బెంగాలీ స్విమ్మర్ పై గోవాకు చెందిన శిక్షకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అతగాడి కాంట్రాక్టును రద్దుచేసి, వెంటాడి దిల్లీలో బేడీలు వేశారు.అయిదేళ్ల క్రితం తమిళనాడులో హాకీ కోచ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 15 మంది ఫిర్యాదు చేశారు.దర్యాప్తులో ఆ ఆరోపణలు నిజమేనని తేలాయి.2010-2019 మధ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో 45 లైంగిక వేధింపుల కేసులు వెలుగుచూశాయి.అందులో 29 శిక్షకులపై వచ్చినవే.

వారిలో ఒక కోచ్ ను సస్పెండ్ చేశారు.ఇంకో ఇద్దరి ఒప్పందాలు రద్దయ్యాయి!నాలుగు నెలలుగా పతాక శీర్షికలకు ఎక్కుతున్న రెజ్లర్ల కేసులో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకనే ఎఫ్ఎస్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదైంది.

భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ కు కొంతమంది జాతీయ కోచ్ లు వంతపాడుతున్నా, క్రిమినల్ నేరచరిత కలిగిన వివాదాస్పద నేతను కటకటాల వెనక్కి పంపి ప్రస్తుత రెజ్లర్ సంఘాన్ని రద్దు చేసేదాకా తాము తగ్గేదే లేదని మల్లయోధులు ప్రతిన పూనుతున్నారు.ఒక్క రెజ్లర్ సంఘంలోనే కాదు, దేశంలోని 30 జాతీయ క్రీడాసంస్థల్లో సగానికి పైగా లైంగిక వేధింపులపై విచారణ చేపట్టే వ్యవస్థే లేదు.

ఈ దుస్థితి కారణంగానే ఢిల్లీ, ముంబయి,బెంగళూరు, భోపాల్ సహా వివిధ క్రీడాసంఘాల కేంద్రాల్లో లైంగిక వేధింపుల బాగోతాలు,అవినీతి కోలాటాలు రచ్చకెక్కుతున్నాయి.ఆటల నేపథ్యం,క్రీడను రక్తి tea కలిగిన సమర్థులకే సమాఖ్యల నాయకత్వం దఖలు పడేలా విధివిధానా లను పరిపుష్టీకరించాలని సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు.

విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల పరికల్పన,మెరికల ఎంపిక, శిక్షణ,తదితర బాధ్యతలన్ని ఆయా క్రీడాసమాఖ్యలకే దఖలుపడాలి.క్రీడాసంఘాలకు రాజకీయ పీడ విరగడ అయితేనే అథ్లెట్ల సహజసిద్ధ ప్రతిభ వికసించి,దేశానికి పతకాల పంట పండుతుందని అభిప్రాయపడ్డారు.

న్యాయం కోసం ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్ల ఉద్యమానికి ప్రజా ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న సంపూర్ణ సంఘీభావమును ప్రకటించారు.యుపిలో ఎంపిగా డబ్ల్యూఎఫ్ఎ అధ్యక్షునిగా వున్న నిందితుడు బ్రిజ్ భూషణ్ ను తక్షణం అరెస్టు చేయాలని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.

మన అక్కచెల్లెళ్లకు సంపూర్ణ రక్షణ కల్పించే అంతవరకు దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వివిధ రూపాలలో ప్రజాస్వామిక పోరాటాలను బలోపేతం చేయాలని బాధితుల బంధువు,పీడిత ప్రజా నేస్తం కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పిలుపునిచ్చారు.

Latest Nalgonda News