గడువులోగా సీఎంఆర్ అంధించాలి:కలెక్టర్ ఎస్. వెంకటరావు

సూర్యాపేట జిల్లా:రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోపు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) అందించాలని కలెక్టర్‌ ఎస్.వెంకటరావు ఆదేశించారు.

మంగళవారం సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్‌ మిల్లుర్లతో జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డేతో కలిసి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30 లోపు కస్టం మిల్లింగ్‌ ధాన్యాన్ని మరపట్టి ఎఫ్‌సీఐకు అప్పగించాలన్నారు.

Collector S Should Close The CMR Within The Deadline. Venkatarao , Collector S.V

మిల్లుల వారీగా ఇప్పటివరకు వచ్చిన సీఎంఆర్‌ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిరంతరం సివిల్ సప్లయ్ అధికారులు మిల్లులను తనిఖీ చేయాలని,మిటర్ రీడింగులను కూడా పరీశిలిస్తారని,ఆర్డీవో మిల్లులని పర్యవేక్షించాలని తెలిపారు.

రోజువారీగా లక్ష్యం నిర్ధేశించుకుని బియ్యం సరఫరాను పూర్తి చేయాలని సూచించారు.గడువులోపు సీఎంఆర్‌ పూర్తి చేయ్యలన్నారు.

Advertisement

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత,జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు,మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News