విఓఏలా సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ తీసుకుంటారు: మారపెళ్లి మాధవి

సూర్యాపేట జిల్లా: సీఎం కేసీఆర్ ఐకెపి విఓఏల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం జరుగుతుందని ఐకెపి విఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మారపెళ్లి మాధవి అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో బిఆర్ టియు జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీతో కలిసి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రతి ఉద్యోగికి, కార్మికునికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

అన్ని వర్గాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.త్వరలోనే ఐకెపి విఓఏలు తీపి కబురు వినడం ఖాయమన్నారు.

CM Will Take Initiative To Solve VOA Problems Marapelli Madhavi,CM Kcr, VOA Pro

తొందరపడి సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు.ఉద్యోగుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ ఐకెపి విఓఏల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారన్నారు.

విఓఏలకు ఉద్యోగ భద్రత ఉండాలని,త్వరలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుందని,యూనిఫామ్ కి కూడా బడ్జెట్ కేటాయించిన తరువాత వేరే యూనియన్ వాళ్ళు మాకు వేతనం పెంచితే చాలు మిగతా సౌకర్యాలు అవసరం లేదన్నారన్నారు.కొందరు రెచ్చగొట్టి విఓఏల ఐక్యతను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని, వారికి బుద్ది చెప్పాలని అన్నారు.

Advertisement

విఓఏలకు త్వరలోనే వేతనం పెంపుదల ఉంటుందని తొందరపడి సమ్మెకు పోతే సమస్య మరింత జఠిలం అవుతుందన్నారు.జిల్లా అధ్యక్షురాలు శారద, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చందర్, జిల్లా కార్యదర్శి పండగ శైలజ,జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్ నాయక్,సంధ్య, సైదులు,మల్లేష్,సరిత,ముత్తయ్య,శీను నాయక్, అలివేలుమంగ,అంజి,బాబు,చంద్రకళ పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News