తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.
మరికొద్ది నెలలో జరగబోయే ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి అన్ని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రకటించకుండానే.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ( BRS party ) నుండి పోటీ చేసే మొదటి అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం జరిగింది.ఈ లిస్టులో చాలావరకు సిట్టింగులకు స్థానం కల్పించారు.
అంతేకాదు ఎన్నడూ లేని రీతిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేయడానికి రెడీ కావడం జరిగింది.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 8న భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి( Gandra Venkataramana Reddy ) తెలిపారు.
పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాలలను సీఎం ప్రారంభం చేస్తారన్నారు.అలాగే మంజూర్ నగర్లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం పాల్గొంటారన్నారు.
మరో రెండు వారాలలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం.భారీ భద్రత ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు.ఈ పర్యటనలో ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నట్లు సమాచారం.