తెలంగాణలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

హైదరాబాద్/నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt )దసరా కానుకగా వచ్చే నెల 24వ తేదీ నుండి సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ( CM KCR Breakfast Scheme )ప్రారంభించనున్నది.దీంతో ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.

సోమవారం–గోధుమరవ్వ ఉప్మా,చట్నీ,మంగళవారం–బియ్యం రవ్వ కిచిడి, చట్నీ,బుధవారం– బొంబాయిరవ్వ ఉప్మా, సాంబార్,గురువారం– రవ్వ పొంగల్,సాంబార్,శుక్రవారం–మిల్లెట్ రవ్వ కిచిడి,సాంబార్,శనివారం –గోధుమరవ్వ కిచిడి, సాంబార్.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు,ఎయిడెడ్ స్కూల్స్,మోడల్స్కూ ల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.ఈ పథకం ప్రారంభంపై విద్యార్థులు,వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాల్టి నుంచి శబరిమలై ఆలయం మూసివేత

Latest Nalgonda News