ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కాంబో అంటే ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలు వచ్చి టాలీవుడ్ లోనే సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇక ఇప్పుడు నాల్గవసారి కూడా ఈ కాంబో రిపీట్ కాబోతుంది.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు ఈ కాంబోలో తెరకెక్కాయి.
మొదటి రెండు సినిమాలు మంచి హిట్ కాగా మూడవ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అప్డేట్ వచ్చింది.తమ నాల్గవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించగా ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ రోజే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి సమాచారాన్ని మేకర్స్ ప్రకటించక పోయినప్పటికీ ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాతో అల వైకుంఠపురములో కాంబో రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.పూజా హెగ్డేను( Pooja Hegde ) హీరోయిన్ గా మళ్ళీ త్రివిక్రమ్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
త్రివిక్రమ్ ముందుగా గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమాలోనే ఈ అమ్మడికి ఛాన్స్ ఇచ్చాడు.కానీ ఆ తర్వాత ఈమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు అనౌన్స్ మెంట్ చేసారు.దీంతో వీరి కాంబోకు బ్రేక్ పడింది.అయితే మళ్ళీ త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇచ్చినట్టు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.