నల్లగొండ జిల్లా:చిట్యాల మున్సిపల్ కేంద్రం( Chityal Municipality )లో పోలీస్ స్టేషన్ ఎదురుగా 65వ,జాతీయ రహదారిపైన గల జంక్షన్ లో ట్రాఫిక్ నిబంధనలు లేక ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒకవైపు అటుఇటు వెళ్ళే వాహనాలు,పాదచారులు, మరోవైపు హై వే నుండి అతివేగంగా వచ్చే వాహనాల జోరుతో ఈ జంక్షన్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
ప్రతిరోజూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జంక్షన్ లో ప్రయాణం చేస్తున్నారు.నిత్యం రోడ్డు ప్రమాదాలతో ఈ జంక్షన్ మృత్యువు మార్గంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సిఐటియు నేత బోయిన శ్రీనివాస్ యాదవ్( Boina Srinivas Yadav ) మాట్లాడుతూ ఈ జంక్షన్ అత్యంత ప్రమాదకమైనది.ఆదివారం అరగంట వ్యవధిలోనే రెండు యాక్సిడెంట్లు జరిగాయి.
ఇంజనీర్ల వైఫల్యం, నాయకుల లాలూచీ, వ్యాపారుల కక్కుర్తి మూలంగా రోడ్డు నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగింది.దీనివల్ల రోజు ఏదోక ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరుగుతుంది.
సంబంధిత అధికారులు ఈ సమస్యపైన స్పందించి ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy