మెగా ఫ్యాన్స్ తిడుతుంటే.. చిరు మాత్రం థమన్ ను ఆకాశానికి ఎత్తుతున్నాడుగా..

తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లలో ఇప్పుడు టాప్ లో ఎవరు ఉన్నారంటే థమన్ పేరునే చెబుతున్నారు.ఈయన ఈ మధ్య చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో అంతా కూడా ఈయన వెంటే పడుతున్నారు.

 Chiranjeevi Comments On Music Director Thaman, Godfather Movie, Acharya, Megasta-TeluguStop.com

అయితే ఈయనకు ఇటీవల మళ్ళీ కాపీ క్యాట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి ఈయన తాజాగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకు కూడా సంగీతం అందించాడు.

మరి ఈ సినిమా విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ ఏ విధంగానూ ఖుషీ అవ్వలేక పోతున్నారు.మ్యూజిక్ నుండి బీజీఎమ్ వరకు అన్ని విషయాల్లో థమన్ పై గుర్రుగా ఉన్నారు.

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గాడ్ ఫాదర్ టీజర్ తో అయితే బాగా అప్సెట్ చేసాడు.ఈ టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని విన్న వెంటనే గని సినిమాలోది దింపేశారు అని కామెంట్స్ వినిపించాయి.

అయితే మెగాస్టార్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు రివర్స్ లో కామెంట్స్ చేసారు.ఈయన చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు చర్చకు దారి తీశాయి.తాజాగా ఇన్ ద క్లౌడ్స్ విత్ గాడ్ ఫాదర్ అనే పేరుతో శ్రీముఖి తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు ప్రోమోను తాజాగా రిలీజ్ చేసారు.

ఈ ప్రోమోలో థమన్ పై మెగాస్టార్ ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ చేసారు.తమన్ పై చిరు ఎంత నమ్మకంగా ఉన్నారో ఈయన మాటల్లోనే అర్ధం అవుతుంది.మరి ఈయన నమ్మకం థమన్ నిలబెడతాడో లేదో చూడాలి.

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది.చూడాలి మెగాస్టార్ ఆచార్య ప్లాప్ ను అందుకుంటాడో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube