టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత. ఎప్పుడైతే నాగచైతన్య నుండి విడిపోయిందో అప్పటినుండి జనాల దృష్టిలో నెగిటివ్ ముద్రను సంపాదించుకుంది.
నాగచైతన్యతో విడిపోక ముందు వరకు తెలుగు ప్రేక్షకుల నుండి సమంతకు మంచి అభిమానం ఉండేది.పైగా తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది.
కానీ ఒక విడాకుల పేరుతో అన్ని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ.తొలిసారిగా ఏం మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత.ఆ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది.తన ప్రేమ రహస్యాన్ని బయటికి పెట్టకుండా.
వరుసగా సినిమాలపై దృష్టి పెట్టింది.ఒక స్టార్ హోదాను సొంతం చేసుకున్న సమయంలో.
తన ప్రేమ విషయాన్ని బయట పెట్టింది.
దీంతో నాగచైతన్య కూడా ఇంట్లో ఒప్పించి సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత కొంతకాలమైనా కూడా వీరి జీవితం అద్భుతంగా సాగింది.ఇక సమంతకు మాత్రం బాగా కలిసి వచ్చింది.
వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది.ఇదే కాకుండా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.
మొత్తానికి అక్కినేని కోడలుగా ఒక హోదాను సొంతం చేసుకుంది.
కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది.
కారణం ఏంటంటే నాగచైతన్యని విడిపోవటం.పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావోస్తుండగా ఆ సమయంలో తాము విడిపోతున్నాము అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
అంతే ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను టార్గెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.

ఇక వారు విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం కావొస్తుంది.మామూలుగా ఏ నటీనటులైనా విడాకులు తీసుకుంటే అది కొన్ని రోజుల వరకు మాత్రమే చర్చగా సాగుతుంది.కానీ సమంత, నాగచైతన్యలది అలా కాదు.
సంవత్సరం అవుతున్న కూడా వీరి విడాకులను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఆ సమయంలో వీరి విడాకులకు కారణం చాలా పుకార్లు వినిపించాయి.
కొందరు సమంత చేస్తున్న ఓవర్ షో వల్ల అక్కినేని ఫ్యామిలీ తనని దూరం పెట్టింది అని అన్నారు.కానీ ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారు అనేది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
భవిష్యత్తులోనైనా వీరి విడాకుల గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.ఏదైతే ఏంటి.విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరి జీవితంలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బాగా దూసుకుపోతున్నారు.కానీ సమంతను మాత్రం అస్సలు వదలట్లేదు.ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.
అందులో శాకుంతలం సినిమా ఒకటి.అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల కాగా.
ఆ పోస్టర్ లో సమంత పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
నిజానికి ఆ పోస్టర్ లో సమంతను ట్రోల్ చేయడానికి ఏమీ లేదు.
కానీ అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు తను చూపించాల్సింది అన్నీ వేరే సినిమాల్లో కూడా చూపించిందిగా.
ఇంకా ఇందులో ఏముంది అంతగా.అని కామెంట్లు పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.







