గుడిపల్లి మండలం మాకొద్దని రాస్తారోకో

నల్లగొండ జిల్లా: పెద్ద అడిశర్లపల్లి మండలం చిలకమర్రి గ్రామాన్ని గుడిపల్లి మండలంలో కలపవద్దని గ్రామపంచాయతీ సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి,శనివారం కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన గుడిపల్లి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసి 11 గ్రామాలతో కలిపి ప్రాథమిక గెజిట్ విడుదల చేస్తూ అభ్యంతరాలను 15 రోజులలో కలెక్టర్ కి తెలపాలని కోరిందని అన్నారు.

అందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు తమ గ్రామాన్ని పాత మండలంలోనే ఉంచాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు.గ్రామం నుండి పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రానికి రోడ్డు సదుపాయం ఉందని, గుడిపల్లికి రోడ్డు సౌకర్యం లేదని అందుకే తమ గ్రామాన్ని అందులో కలపవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భార్యల అక్రమ సంబంధాలకు.. భర్తలు బలి.. కొద్దిరోజుల్లోనే 12 మంది కాటికి.. అసలేం జరుగుతోంది?
Advertisement

Latest Nalgonda News