మన అత్యాశనే ఆసరాగా సైబర్ నేరగాళ్ల మోసాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషి అత్యాశను ఆసరాగా చేసుకొని మోసాలు జరుగుతాయి, సైబర్ నేరగాళ్లు సైతం ఇలాగే ఒకటికి రెండు రెట్లు సంపాదించొచ్చని ఆశపెట్టి మీతో కొంత డబ్బుతో పెట్టుబడులు పెట్టిస్తారు, ఆ తర్వాత మీ నుంచి సర్వం దోచేస్తారు అని రూపాయి కి వంద రూపాయలు వస్తున్నాయంటే అనుమనించాల్సిందే.

-మల్టీలెవెల్ మార్కెటింగ్, చైన్ కంపెనీల ప్రచారాలను నమ్మి మోసపోకండి.

ఇలా నకిలీ వ్యక్తులతో భ్రమ కల్పించి ఒకరిద్దరికి బహుమతులు ఇచ్చి ఆశలు రేకెత్తిస్తారు.ఇంట్లోనే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించొచ్చని మాయమాటలు చెప్తారు.

Cheats By Cybercriminals To Feed Our Greed, Cheating Online, Cyber Criminals ,

ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.-ఇలా పోలీస్ అధికారుల ఫోటోలు డీపీగా పెట్టుకొని అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు.

అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.-లాటరీ తగిలిందని వచ్చే వాట్సాప్ మెసేజ్, SMSల పట్ల అప్రమత్తంగా ఉండండి.

Advertisement

అపరిచిత వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేసి, లేదా సోషల్ మీడియాలో కనిపించే లింకులని క్లిక్ చేసి మోసపోవద్దు.తస్మాత్ జాగ్రత్త! -అనధికారిక లోన్ యాప్స్ నుండి చిన్న క్లిక్ తో మీకు లోన్ వస్తుందనుకుంటే అంతకంటే పెద్ద అగాధంలో పడతారు.

వాళ్లు లోన్ ఇస్తున్నప్పుడు మీ ఫోన్లో డేటాను తస్కరించి అందులోని కాంటాక్ట్ లకు అభ్యంతరకమైన మెసేజులు పంపుతారు.అట్టి లోన్ యాప్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవదిలో జరిగిన కొన్ని సైబర్ కేసులు.1.రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు యూట్యూబ్లో సింగపూర్ పంపిస్తాము అనే వీడియో చూసి అతని వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వడం జరిగింది.

అతడు సింగపూర్లో ఆఫీస్ బాయ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మొదటగా రిజిస్ట్రేషన్ కి అని 5000/- రూపాయలను పంపించమన్నాడు.తర్వాత వీసా ఖర్చులకోసం అని చెప్పి 1,40,000/- ను పంపమనగా బాధితుడు పంపించడం జరిగింది.

తర్వాత బాధితున్ని వాట్సప్ లో బ్లాక్ చేయడం జరిగింది.ఈ విధంగా బాధితుడు నష్టపోయారు.2.వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఒక అనుమతి లింకును క్లిక్ చేయడం వలన అతని మొబైల్ హాక్ చేయబడి అతనికి తెలియకుండానే అతని అకౌంట్ నుండి 54,367/- రూపాయలను నష్టపోవడం జరిగింది.కాబట్టి ఎటువంటి లింక్స్ పైన క్లిక్ చేయకూడదు.3.కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి బజాజ్ ఫైనాన్స్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి 1 లక్ష లోన్ అప్రూవల్ అయిందని దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫ్రీ మరియు పేపర్ చార్జెస్ ఇంకా ఇతర ఖర్చులకోసం అని చెప్పి అతని వద్ద నుండి దాదాపుగా 18,000/- రూపాయలను మోసగించడం జరిగింది.

గుడుంబా అమ్మకాల పై పోలీసు ల నిఘా
Advertisement

Latest Rajanna Sircilla News