చంద్ర‌బాబు కంచుకోట బీట‌లు వారుతోందా.. అల‌ర్ట్ అవ్వ‌క‌పోతే క‌ష్ట‌మే..?

ప్ర‌తి పార్టీకి కొన్ని కంచుకోట‌లు ఉంటాయి.ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

అక్క‌డ ఆ పార్టీకి త‌ప్ప మ‌రే పార్టీకి ఓట్లు ప‌డ‌వు.

రాష్ట్రంలో పార్టీ గెలిచినా ఓడినా స‌రే ఆ నియోజ‌వ‌ర్గాల్లో మాత్రం ఆ పార్టీకి అస్స‌లు తిరుగుండ‌ద‌నే చెప్పాలి.

అయితే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు కూడా ఓ కంచుకోట ఉంది.అదే కుప్పం నియోజ‌క‌వ‌ర్గం.

ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో ఎవ‌రికీ పెద్ద‌గా తెలిసేది కాదు.కానీ ఎప్పుడైతే చంద్ర‌బాబు నాయుడు ఇక్క‌డ‌కు వెళ్లి పోటీ చేశారో అప్ప‌టి నుంచే దీనిపేరు రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్మోగిపోతోంది.

Advertisement
Chandrababu Kanchukota Beats Are Coming .Is It Difficult If The Alert Is Not Iss

ఇక దాదాపుగా మూడు ద‌శాబ్దాలుగా కుప్పం నుంచే గెలుస్తున్నారు చంద్ర‌బాబు.ఇక్క‌డ ఆయ‌న‌కు తిరుగే లేకుండా పోయింది.

కుప్పంలో ఇప్ప‌టి దాకా చంద్ర‌బాబుకు స్వ‌యంగా వెళ్లి నామినేష‌న్ కూడా వేయ‌క‌పోయినా ఆయ‌న‌కు మాత్రం అరలక్షకు తక్కువ కాకుండా మెజార్టీ ఓట్లు ఇస్తూ గెలిపిస్తున్నారంటే ఇక్క‌డ చంద్ర‌బాబుకు ఎంత‌లా ఇమేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.అయితే ఇంత‌లా ఆద‌రిస్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్పుడు బీటలు వారుతున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌త ఎన్నికల్లోనే ఇది స్ప‌ష్టంగా అర్థం అయింది.ఎందుకంటే గ‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా మెజార్టీ త‌గ్గిపోయింది చంద్ర‌బాబుకు.

Chandrababu Kanchukota Beats Are Coming .is It Difficult If The Alert Is Not Iss

అర‌ల‌క్షగా ఉన్న మెజార్టీ కాస్తా ముప్పయి వేలకు త‌గ్గిపోయింది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇక అప్ప‌టి నుంచే ఇక్క‌డ వైసీపీ గ్రౌండ్ లెవ‌ల్లో బ‌ల‌ప‌డేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.మొన్న‌టికి మొన్న లోకల్ బాడీ ఎల‌క్ష‌న్ల‌లో కూడా వైసీపీ మెజార్టీ స్థానాల‌ను ద‌క్కించుకుంది.

Advertisement

ఆ త‌ర్వాత వ‌చ్చిన పంచాయతీ ఎన్నిక‌ల్లోనూ ఇది రిపీట్ అయిపోయింది.దీంతో గ్రామాల్లో ప‌ట్టు త‌గ్గిపోతే ప్ర‌మాద‌మ‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి వ‌రుస‌గా టూర్లు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే మ‌రోసారి మూడు రోజుల ప్రోగ్రాం పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.త్వ‌ర‌లోనే వెళ్లి మ‌రోసారి ప్ర‌జ‌ల‌తో మేమ‌క‌మ‌వుతార‌ని స‌మాచారం.

మ‌రి ముంద‌స్తుగా అల‌ర్ట్ కాక‌పోతే క‌ష్ట‌మే అని తెల‌స్తోంది.

తాజా వార్తలు