బాలూ నాయక్ కు మంత్రి పదవి కోసం ఛలో ఢిల్లీ: లంబాడి జేఏసీ

నల్లగొండ జిల్లా: తెలంగాణ మంత్రివర్గంలో లంబాడ బిడ్డకు చోటు కల్పించాలని ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు శుక్రవారం దేవరకొండ నుండి లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లికి బయలుదేరారు.ఈసందర్భంగా లంబాడ జేఏసీ నాయకులు బాబూరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 40 నుంచి 50 లక్షల జనాభా ఉన్న లంబాడి సామాజిక వర్గానికి చెందిన బిడ్డలు ఉండగా ఒక్క మంత్రి పదవి కూడా లేదన్నారు.

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు వినతిపత్రం ఇచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.1970 నుంచి మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తూ వచ్చారని, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదేవిధంగా లంబాడి సామాజిక వర్గానికి చెందిన బాలూ నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.లేనియెడల ఏఐసిసి కార్యాలయాలన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్

Latest Nalgonda News