నేడు కేంద్ర జలవనరుల సంఘం కీలక సమావేశం

కేంద్ర జలవనరుల సంఘం కీలక సమావేశం నేడు జరగనుంది.ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో అధికారులు భేటీకానున్నారు.

 Central Water Resources Association Meeting Today-TeluguStop.com

ఈ సమావేశానికి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.పోలవరం డ్యాం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఇటీవలే నాలుగు రాష్ట్రాల అధికారులతోత కేంద్రం వర్చువల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలవరం బ్యాక్ వాటర్ పై మూడు రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్రం వెల్లడించింది.

ఈ క్రమంలోనే బ్యాక్ వాటర్ సర్వేకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించేందుకు మళ్లీ ఈరోజు సమావేశం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube