కేసీఆర్ జాతీయ పార్టీ : బాబు నవ్వారు.. 'తమ్ముళ్లు ' తిట్టిపోస్తున్నారు !

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.దాంట్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తూ తీర్మానం చేశారు.

 Chandrababu No Comments On Kcr's National Party Chandrababu, Tdp, Ysrcp, Ap, Ja-TeluguStop.com

ఎన్నికల సంఘానికి దీనిపై సమాచారం అందించారు.ఇక న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కెసిఆర్ కొత్త జాతీయ పార్టీ బీఆర్ ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు, కర్ణాటక , తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు విస్తరించి అక్కడ బలోపేతం  అయ్యాక ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు కేసిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.అయితే కొత్త పార్టీ ఏర్పాటుపై వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఏపీ అధికార పార్టీ వైసీపీ తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.కొత్త జాతీయ ఏర్పాటును స్వాగతిస్తున్నామని,  రాజకీయాల్లో పోటీ తత్వం ఉండాలని అప్పుడే ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందుతుంది అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.

       చంద్రబాబును మీడియా ప్రతినిధులు స్పందించాల్సిందిగా కోరగా చిరునవ్వులు చిందించారు తప్ప,  దీనిపై స్పందించేందుకు ఆయన ఇష్టపడలేదు.అయితే బాబు స్పందించకపోయిన ఆయనకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాత్రం దీనిపై స్పందించారు.

రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని తమకు తాముగా జాతీయ పార్టీగా మార్చేసుకుంటే సరిపోతుందా అంటూ వెటకారం చేశారు.అంతేకాదు కేసీఆర్ ను ఏ రాష్ట్రమైనా స్వాగతిస్తుందేమో కానీ , రాష్ట్ర విభజనకు కారణమై, ఏపీకి ఇవ్వాల్సిన సొమ్ములు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కెసిఆర్ ను ఏపీలో ఎవరు స్వాగతించారని అశోక్ బాబు చెబుతున్నారు.

అసలు కెసిఆర్ కు జాతీయ భావం లేదనే విషయం ఏపీ తెలంగాణ విభజన సందర్భంగా అర్థమయిపోయిందని అశోక్ బాబు అంటున్నారు.
       

కెసిఆర్ జాతీయ పార్టీకి మద్దతుగా వచ్చిన కుమార స్వామి సైతం బీఆర్ ఎస్ లో ఆయన పార్టీని విలీనం చేయనప్పుడు ఇంకెవరు చేస్తారు అంటూ ఎద్దేవా చేశారు.అయితే అశోక్ బాబు ఈ వ్యాఖ్యలను సొంతంగా చేసినవి కాదు.పార్టీ ఆదేశాల మేరకు మాట్లాడినవే.

అంటే టిడిపి అభిప్రాయం ఏమిటనేది స్పష్టమైపోయింది.టిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా చెప్పుకోవడాన్ని టిడిపి తప్పు పడుతోంది సరే .మరి టిడిపి సంగతేంటని ప్రశ్నలు మొదలయ్యాయి టిడిపి కూడా జాతీయ పార్టీగానే ప్రకటించుకుంది.దానికి కార్యవర్గాన్ని కూడా ప్రకటించుకుంది .కానీ ఏపీలో మాత్రమే ఆ పార్టీ ప్రభావం ఉంది.కెసిఆర్ స్థాపించిన జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది .ఎన్నికల సంఘం వద్ద ఈ మేరకు గుర్తింపుకు ప్రయత్నాలు చేస్తోంది.అలాగే న్యాయం పరంగాను ప్రక్రియ మొదలు పెట్టింది .కానీ టిడిపి జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ఇతర రాష్ట్రాల్లో బలపడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.అలాగే ఎన్నికల్లో ఏపీలో తప్ప , మిగతా ఎక్కడ పోటీ చేసే ప్రయత్నాలు ఏవి చేయడం లేదు.

కనీసం కాస్త కూస్తో బలం ఉన్న తెలంగాణలోనూ పార్టీని పూర్తిగా వదిలిపెట్టేసింది.ఏపీలో బీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలు మొదలు పెడితే ఎక్కువ నష్టపోయేది తామే అన్న విషయాన్ని టీడీపీ బలంగా నమ్ముతూ టెన్షన్ పడుతోంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube