నూతన కార్మిక చట్టాల ఆలోచనను కేంద్రం విరమించుకోవాలి: సిఐటియూ

సూర్యాపేట జిల్లా: ఈనెల 16న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియూ సూర్యాపేట జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్,మాజీ జడ్పీటిసి ముషం నరసింహ పిలుపునిచ్చారు.

మంగళవారం మేళ్ళచెరువు మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో సమ్మెకు సంబంధించిన నోటీసును సీనియర్ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావుకి అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక చట్టాలను తేవాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.కార్మిక హక్కులను కాలరాసే విధానాలను విడనాడాలని అన్నారు.

Center Should Drop Idea Of ​​new Labor Laws CITU, Central Government, ​�

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ,కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే సమ్మెలో కార్మికులు, రైతులు,స్కీం వర్కర్లు, ఆశాలు,అంగన్వాడీలు, విఏఓలు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నన్నెపంగ రమేష్, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News