దేశ వ్యాప్తంగా బీసీ కుల జనగణన చేపట్టాలి:బీఎస్పీ

సూర్యాపేట:బీసీ కుల జనగణన చేపట్టాలని,బీసీల జనాభా ధామాషా ప్రకారము 50% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసి మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో,నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి ఉపేందర్ అధ్యక్షతన కోదాడలోని స్థానిక రంగా థియేటర్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమంను చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నాయకులు,కుల సంఘాల నాయకులు,మేధావులు, విద్యావంతులు పాల్గొని మద్ధతు తెలిపారు.

ఈ సందర్భంగా కోదాడ పట్టణ మాజీ సర్పంచ్ పార సీతయ్య పాల్గొని జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.వెనుక బడిన కులాల సంక్షేమ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా రూపకల్పన చేయడానికి బీసీ కులాల వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపకరిస్తాయని వారు అన్నారు.

దాదాపు ఆరు దశాబ్దాలపాటు బ్రిటీష్ ప్రభుత్వం హయంలో దేశంలో నిర్వహించిన జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల ఆర్థిక,సామాజిక లెక్కలు ఆధారంగానే నేటీకీ సంక్షేమ పథకాలు అమలు చేయటం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని చట్ట సభల్లో విద్య,ఉద్యోగ రంగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌ కేటాయించాలని డిమాండ్ చేశారు.ఏ అభ్యర్దన లేకుండగానే ఈ డబ్ల్యూ ఎస్ వారికి పదిశాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఏన్నో ఏళ్ల డిమాండ్ ను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నారు.

అదేవిధంగా బిఎస్పి రాబోవు ఎన్నికల్లో బిసీలకు 60 నుంచి 70 సీట్లు కెటాయిస్తామన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ని అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకోని టిక్కెట్లు కెటాయించే దమ్ము ఉందా అని సవాలు విసిరారు.మాజీ సర్పంచ్ పారా సీతయ్య సంఘి భావం తెలిపి మాట్లాడుతూ బీసీలంతా తమ హక్కుల కోసం ఏకం కావాలన్నారు.

Advertisement

బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు కందుకూరు ఉపేందర్ అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ ఊయల నర్సయ్య, నాయకులు పాలూరి సత్యనారాయణ,సీపీఎం నాయకులు ముత్యాలు,బీయస్పీ నాయకులు రాపోలు నవీణ్,మల్లేష్ యాదవ్,కొండ బీమయ్య గౌడ్,పిడమర్తి దశరధ, రామారావు,కాంపాటి శ్రావణ్ కుమార్,యర్రమల్ల నాగమణి, వెంపటి నాగమణి,నాగమల్ల జ్యోతి,ఆశాబేగం,సయ్యద్ రఫీ,నెమ్మాది సురేష్,సురేందర్,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024
Advertisement

Latest Suryapet News