యాదాద్రిలో సెల్ ఫోన్లు నిషేధం...ఉత్త‌ర్వులు జారీ

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ( Sri Lakshmi Narasimha Swamy Temple ) భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఆలయంలో నిరంతర భద్రత,నిఘా కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

భద్రతా చర్యల్లో భాగంగా యాదాద్రి ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ప్రధాన ఆలయంలో సెల్‌ ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ ఆలయ ఈఓ భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటి వరకు భక్తులకు మాత్రమే ఈ నిబంధన వర్తింపజేయగా,ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెబుతున్నారు.అర్చకులు, మినిస్టీరియల్ సిబ్బంది,ఎస్పీఎఫ్, హోంగార్డులు, జర్నలిస్టులకు కూడా ఈ నిబంధనను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) తరహాలో ఆలయానికి పోలీసు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు కొండ దిగువన ఉన్న పుష్కరిణి, సత్యనారాయణ వ్రత మండపం వద్ద భద్రతను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

మరోవైపు భక్తుల లగేజీని తనిఖీ చేసేందుకు స్కానర్లు,మెటల్ డిటెక్టర్లు వంటి ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అందరూ కలిసి సమిష్టిగా అన్నదాతకు అన్యాయం
Advertisement

Latest Rajanna Sircilla News