వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఎస్పీ ధర్నా

నల్లగొండ జిల్లా:యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక అన్నదాతలు ఆగమాగం అవుతున్నారని,ఇదే అదునుగా భావించి మిల్లర్లు, వ్యాపారస్తులు,దళారులు రైతులను దోచుకుంటున్నారని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జీ ప్రియదర్శిని మేడి ఆవేదన వ్యక్తం చేశారు.

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తాత్సారం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా బీఎస్పీ ఆధ్వర్యంలో నకిరేకల్ తాహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు పాలన మరిచి రోడ్ల మీదకు వచ్చి రైతు పేరిట రాజకీయ డ్రామాలడుతున్నాయని విమర్శించారు.ఇప్పటికైనా స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

BSP Dharna To Set Up Vadla Buying Centers-వడ్ల కొనుగోలు

లేనియెడల బీఎస్పీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని హెచ్చరించారు.అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గద్దపాటి రమేష్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్,బీఎస్పీ మండల నాయకులు తాటిపాముల తరుణ్ తేజ్,చెడిపోయిన ప్రవీణ్,గద్దపాటి విజయ్, వంటేపాక అజిత్,మొహమద్ మోబిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News