ఈశాన్య రాష్ట్రాల్లో పోల్ బాజా మోగింది.త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.
త్రిపురలో ఫిబ్రవరి 16 పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం తెలిపింది.
అదేవిధంగా నాగాలాండ్, మేఘాలయాలలో ఫిబ్రవరి 27న ఎన్నికల పోలింగ్ జరగనుందని వెల్లడించింది.మార్చి 2న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
కాగా నాగాలాండ్ అసెంబ్లీ పదవీకాలం మార్చి 12న ముగియనుండగా… మేఘాలయ అసెంబ్లీ పదవీకాలం మార్చి 15న, త్రిపుర అసెంబ్లీ పదవీకాలం మార్చి 22న ముగియనుంది.కాగా త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.