పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం సి-విజిల్: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పౌరులకు సి-విజిల్ యాప్ బ్రహ్మాస్త్రం లాంటిదని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినచో ప్రజలు సి-విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

బాధ్యతాయుత పౌరుని చేతిలో బ్రహ్మాసం సి-విజిల్ యాప్ అని,ఇందులో ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, నగదు,వస్తువులు,మద్యం ద్రవ్యాలు పంపిణీ చేయడం,ప్రజల ఆస్తులను అనుమతి లేకుండా ప్రచారాలకు వినియోగించడం,కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఓటర్లను రవాణా,అసత్య వార్తల ప్రసారం,చెల్లింపు వార్తలు ప్రచురణ, మారణాయుధాలు కలిగి ఉండడం,ఇతర ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను చేయవచ్చని తెలిపారు.ఫిర్యాదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వెంటనే సి-విజిల్ లో అప్లోడ్ చేయడంతో నిర్ణీత కాల వ్యవధిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ

Latest Nalgonda News