ఫిదా.. అనన్య పాండే కు హైదరాబాద్ సూపర్ వెల్‌కమ్‌

బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే తెలుగు లో లైగర్ సినిమా తో నటించడం ద్వారా సౌత్ కు పరిచయం అవ్వబోతుంది.

పాన్ ఇండియా సినిమా గా లైగర్ నిలవడం లో అనన్య కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు.

ట్రైలర్ చూస్తూ ఉంటే సినిమా లో ఆమెది కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే పాత్ర అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఆ విషయాన్ని పక్కన పెడితే నేడు లైగర్ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

అందుకోసం హైదరాబాద్ వచ్చింది.హైదరాబాద్ కు వచ్చిన అనన్య పాండే కు విజయ్ దేవరకొండ అద్భుతంను కళ్ల ముందు ఉంచాడు.

ఆమె ఎప్పుడు ఊహించని భారీ వెల్‌కమ్‌ ఆమెకు దక్కేలా చేశాడు.ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వీరు సందడి చేశారు.

Advertisement

ఆ సందర్బంగా ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.హీరోయిన్‌ అనన్య పాండే ఆ హంగామాకు ఫిదా అయ్యింది.

ఆమె కళ్లలో ఆనందం ను క్లీయర్ గా చూడవచ్చు.హీరోయిన్ గా ఆమె ఇప్పటి వరకు పెద్దగా సినిమా లు చేసింది ఏమీ లేదు.

బాలీవుడ్‌ లో కూడా ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి.గుర్తింపు లభిస్తుంది.

ఇలాంటి సమయంలో ఇలాంటి వెల్‌ కమ్‌ అంటే ఖచ్చితంగా చాలా స్పెషల్‌.ఈ వెల్‌ కమ్‌ కు ఆమె కళ్లు చెమర్చినా ఆశ్చర్యం లేదు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

గజ మాల తో పాటు పూల వర్షం కురిపించడం ద్వారా విజయ్‌ దేవరకొండ ఆమె ఎప్పటికి మర్చి పోలేని అరుదైన అద్భుతమైన వెల్‌ కమ్‌ చెప్పాడు.ముందు ముందు కూడా తెలుగు లో ఈమె నటించాలనే కోరిక కలిగేలా చేశాడు అనడంలో సందేహం లేదు.

Advertisement

హీరోయిన్ గా లైగర్‌ సినిమా తో ఈ అమ్మడు సక్సెస్ అయితే ఖచ్చితంగా సౌత్‌ లో ఈ అమ్మడు మరిన్ని సినిమా లు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు