బిగ్‌బాస్‌ -4 అధికారిక డేట్‌ వచ్చేసింది

తెలుగు బిగ్‌ బాస్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈనెల 30 నుండి షో ప్రారంభం కాబోతుందని అంతా అనుకున్నారు.

అయితే అనూహ్యంగా షో వారం రోజులు ఆలస్యం అయ్యింది.కరోనా కారణంగా షో ఈ సారి ఉండక పోవచ్చు అనుకున్నారు.

కరోనా భయం లేకుండా షో ను కాస్త ఆలస్యంగా ప్రారంభించబోతున్నట్లుగా రెండు వారాల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది.అప్పటి నుండి షో ఎలా ఉంటుంది, ఎవరు ఉండబోతున్నారు అనే విషయంపై చర్చ జరుగుతోంది.

తాజాగా అందుకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభ తేదీకి సంబంధించిన ప్రోమో వచ్చేసింది.

Advertisement

కంటెస్టెంట్స్‌ లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో వారం ఆలస్యంగా షోను ప్రారంభించబోతున్నారు.సెప్టెంబర్‌ 6 తారీకు నుండి ఈ షోను షురూ చేయబోతున్నారు.

స్టార్‌ మా నుండి ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది.కంటెస్టెంట్స్‌ విషయంలో ఇంకా కూడా సస్పెన్స్‌ కొనసాగుతోంది.

త్వరలోనే ఆ విషయంపై కూడా క్లారిటీ రాబోతుంది.పెద్ద ఎత్తున ఈసారి షో ఉంటుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మొదటి మూడు సీజన్‌ ల మాదిరిగా కాకుండా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.ఈసారి ఫుల్‌ మజా వస్తుందని అంటున్నారు.

కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే న్యూక్లియర్ వార్ తట్టుకోగలవా..?
Advertisement

తాజా వార్తలు