Bhumika Vasisht : సీక్రెట్ గా ఉంచాల్సిన వీడియోని లీక్ చేశారు.. నటి ఆవేదన?

సినిమా ఇండస్ట్రీలో రియాల్టీ షోలకు ( reality shows )కొదవేలేదు అని చెప్పవచ్చు.ఇప్పటికే ఎన్నో రకాల రియాల్టీ షోలు ఉండగా కొత్త కొత్తగా రియాల్టీ షోలను మొదలు పెడుతూనే ఉన్నారు.

 Bhumika Vasisht : సీక్రెట్ గా ఉంచాల్సిన -TeluguStop.com

అయితే మామూలుగా సెలబ్రిటీలు ఎలా ఉంటారు వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది.అనేది చూపించడమే ఈ రియాల్టీ షోల యొక్క కామన్ పాయింట్ అని చెప్పవచ్చు.

కొన్ని కొన్ని సార్లు రియాల్టీ షోలలో వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలో వారి వ్యక్తిగత విషయాలను కూడా బయటపెడుతుంటారు.

తాజాగా ఎంటీవీ రోడీస్‌( MTV Roadies ) కొత్త సీజన్‌ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది.స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్‌ భూమిక వశిష్ట్‌( Bhumika Vasisht ) ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించింది నటి.ఈ సందర్భంగా భూమిక వశిస్ట్ మాట్లాడుతూ.డ్యాన్స్‌ రియాలిటీ షో తర్వాత నేను సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను.కానీ సెలబ్రిటీ లైఫ్‌ అనేది డబ్బుతో కూడుకున్న పని.ఫేమ్‌, గ్లామర్‌ కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.అందుకని నా లైఫ్‌స్టైల్‌ కోసం అప్పు తీసుకున్నాను.

ఆ అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియోను ఒక యాప్‌లో అప్‌లోడ్‌ చేశాను.సీక్రెట్‌గా ఉంచాల్సిన ఆ వీడియోను ఎవరో ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు.

దాంతో నాపై చాలా విమర్శలు వచ్చాయి.డిప్రెషన్‌ కు వెళ్లిపోయాను అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది భూమిక.ఆమె మాటలు విన్న గ్యాంగ్‌ లీడర్స్‌ రియా చక్రవర్తి, ప్రిన్స్‌ నరూలా భూమికను ఓదార్చారు.రియా ఆమెను వెళ్లి హత్తుకోగా నరూలా దాని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదని, ధైర్యంగా ఉండమని తెలిపారు.

ఇకపోతే ప్రస్తుతం సోనూసూద్‌ ఎంటీవీ రోడీస్‌ షో వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు.ఈ షోలో ప్రిన్స్‌ నరూలా, రియా చక్రవర్తి, గౌతమ్‌ గులటి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.ఢిల్లీ, పుణె, ఇండోర్‌ నగరాల్లో ఆడిషన్‌ నిర్వహించగా ఇందులో కొంతమంది యంగ్‌స్టర్స్‌ను సెలక్ట్‌ చేసుకుని షోలో ప్రవేశపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube