సక్సెస్, ప్లాప్ తో సంబంధం లేదు.. వరస ప్రాజెక్ట్స్ తో బెల్లంకొండ బిజీ

సినిమా హిట్ అయినా ఫట్ అయినా సంబంధం లేకుండా కెరియర్ కొనసాగిస్తున్న అతి తక్కువ మంది హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Sai Sreenivas) ముందు వరుసలో ఉంటాడు.2014 అల్లుడు శీను( Alludu Seenu ) సినిమా తో ఇతగాడి సినిమా ప్రయాణం మొదలైనప్పటి నుంచి 2024 వరకు దాదాపు 12 నుంచి 13 సినిమాల్లో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోలేదు.రాక్షసుడు సినిమా( Rakshasudu ) కాస్త పరవాలేదు అనిపించినా మిగతా చిత్రాలన్నీ కూడా దారుణమైన పరాజయాలే అని చెప్పక తప్పదు.ఆయన కూడా తనకు కెరియర్ కి ఎలాంటి డోకా లేకుండా పోయింది.

 Bellamkonda Sai Sreenivas Upcoming Movies, Alludu Seenu, Rakshasudu , Tollywoo-TeluguStop.com

ఇటీవలనే గంపెడు ఆశలు పెట్టుకున్నా చత్రపతి హిందీ రీమేక్ దారుణంగా పరాజయం పాలైంది.అయినా కూడా అలుపెరుగక సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

Telugu Alludu Seenu, Rakshasudu, Tollywood, Tyson-Movie

ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.తైసన్ నాయుడు( Tyson Naidu ) అనే ఒక యాక్షన్ సినిమా తీస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ అది కాకుండా మరొక రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.స్టువర్టుపురం దొంగ అనే టైటిల్ తో కూడా ఒక చిత్రం రాబోతున్నట్టుగా సమాచారం.ఇకపై ముందు చేసినట్టుగా తప్పులు చేయకుండా కేవలం కంటెంట్ పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బెల్లంకొండ శ్రీనివాస్ తన భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటున్నాడట.

అందుకే యాక్షన్ మరియు రివెంజ్ డ్రామా ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటున్నాడట.మామూలుగా చత్రపతి హిందీ రీమేక్ బాగా హిట్ అవుతుందని బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

అప్పటికే ఇతడి సినిమాలకు యూట్యూబ్లో కోట్లలోవ్యూవర్స్ కూడా ఉన్నారు.ఇదే ఉద్దేశంతో రీమేక్ సినిమా చేసిన ఫలితం మాత్రం ఇవ్వలేదు.

Telugu Alludu Seenu, Rakshasudu, Tollywood, Tyson-Movie

ఇకపై ఈ తప్పులు రిపీట్ చేయకూడదని మంచి కంటెంట్ పై బాగా ఫోకస్ పెంచాడట.మరి కేవలం బడ్జెట్ గురించి కాకుండా కథలను నమ్ముకుంటేనే సినిమాలు హిట్ అవుతాయని చాలా లేటుగా గ్రహించాడు మన బెల్లంకొండ.ఇకనైనా మంచి సినిమాలు తీసి ఒక హిట్ అయిన దక్కించుకోవాలన్న కసితో ఉన్నాడట.మరి మనోడు ప్రయత్నాలు ఏ మేరకు పలుస్తాయో తెలియాలంటే ఇంకా కొంతకాలం పాటు వేసి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube