బెల్లంకొండ 'ఛత్రపతి' పరిస్థితి ఏంటి.. పరువు తీసేనా? నిలిపేనా?

తెలుగు సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే చత్రపతి( chatrapathi ) సినిమాను ప్రస్తుతం హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చత్రపతి సినిమా ప్రస్తుతం హిందీ లో రీమేక్ అయి విడుదలకు సిద్ధం అవుతుంది.

 Bellamkonda Sai Srinivas Chatrapathi Update ,bellamkonda Sai Srinivas , V. V.-TeluguStop.com

తెలుగు దర్శకుడు వివి వినాయక్( V.V.Vinayak ) దర్శకత్వంలో తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన హిందీ చత్రపతి సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Bellamkondasai, Bollywood, Chatrapathi, Prabhas, Rajamouli, Tollywood, Vv

ప్రస్తుతానికి హిందీలో పెద్దగా బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు.పెన్‌ స్టూడియో వారు ఈ సినిమా ను కాస్త ఎక్కువగానే ఖర్చు చేసి నిర్మించారని వార్తలు వస్తున్నాయి.అయినా కూడా హిందీ పేక్షకులు పట్టించుకోక పోవడంతో పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో అంటూ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే నెలలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Telugu Bellamkondasai, Bollywood, Chatrapathi, Prabhas, Rajamouli, Tollywood, Vv

హిందీలో చత్రపతి సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇప్పటి వరకు మినిమం బజ్‌ క్రియేట్ చేయడంలో విఫలమైన చిత్ర యూనిట్ సభ్యులు రూ.100 కోట్ల కలెక్షన్స్ కాదు కదా కనీసం రూ.25 కోట్ల కలెక్షన్స్ ని కూడా నమోదు చేయలేక పోవచ్చు అంటున్నారు.ఈ మధ్య కాలంలో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా పది పదిహేను కోట్ల వసూళ్లు నమోదు చేసేందుకు కింద మీద పడుతున్నాయి.

Telugu Bellamkondasai, Bollywood, Chatrapathi, Prabhas, Rajamouli, Tollywood, Vv

అలాంటిది ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుంది అంటే ఎంతవరకు సాధ్యం అనేది చూడాల్సిందే.బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda sai srinivas ) గురించి హిందీలో ఎవరికీ పెద్దగా తెలియదు.కనీసం దర్శకుడు వివి వినాయక్ గురించి కూడా తెలియదు.దాంతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అందరికీ ఆసక్తిగా ఉంది.తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను రీమేక్ పేరుతో హిందీలో ప్రేక్షకుల ముందు తీసుకు పోయి పరువు తీస్తారా అనే అనుమానాలు కూడా తెలుగు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి( Rajamouli ) వంటి దిగ్గజ దర్శకుడు తీసిన సినిమాను రీమేక్ చేయడం అనేది పెద్ద పొరపాటు అనేది కొందరి అభిప్రాయం ఈ విషయంలో మీరు ఏమంటారు మాకు తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube