భారీ వర్షాలతో అలర్ట్ గా ఉండాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.

వినయ్ కృష్ణారెడ్డి ప్రకటనలో తెలిపారు.

రెవెన్యూ,పిఆర్, పోలీస్,నీటిపారుదల శాఖలకు సంబంధించిన అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి చెరువులు,కుంటలు పొంగి ప్రవహించే చోటకు జాలర్లలు,ప్రజలు,పశువులు వెళ్లకుండా చూడాలన్నారు.అలాగే గ్రామాలలో పాత మట్టి గోడలు,తడిసి ఉన్న కరెంటు స్తంభాల వద్ద పిల్లలను వెళ్లకుండా ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

Be On Alert For Heavy Rains: Collector-భారీ వర్షాలతో అ

జిల్లా వ్యాప్తంగా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.ముంపు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక ప్రకటనలో తెలిపారు.

అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

Latest Suryapet News