సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సోషల్ మీడియాలో నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ లాటరీలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ మొదలగు వంటి వాటిని చూసి ప్రజలు మోసపోవద్దని వీటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు

వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సప్ కి పార్ట్ టైం జాబ్స్ అని మెసేజ్ వచ్చింది.సైబర్ నేరస్థుడు బాధితునితో వాట్సప్ లో చాట్ చేస్తూ ఒక వెబ్సైట్ బ్లూ లింక్ షేర్ చేశాడు.

టెలిగ్రామ్ యాప్ ద్వారా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ టాస్కులు కంప్లీట్ చేయాలని నమ్మించి మొదట చిన్న టాస్కులకి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయగా బాధితునికి అమౌంట్ వచ్చింది.తర్వాత టాస్కులు పెంచుకోవడం వల్ల బాధితునికి ఎటువంటి అమౌంట్ రాలేదు.

బాధితుడు అది సైబర్ ప్రాడని గమనించాడు.బాధితుడు 1,04,393/- నష్టపోయాడు.

Advertisement

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఫేస్బుక్లో బైక్ అమ్మబడును అని పోస్ట్ చూశాడు.వారిని కాంటాక్ట్ చేయగా వాళ్ళు ఆర్మీ పర్సన్ అని చెప్పి బైక్ కాస్ట్ 33000/-గా ఫిక్స్ చేశారు.

తర్వాత బండిని మీ అడ్రస్ కి హోం డెలివరీ చేస్తామని చెప్పి డెలివరీ చార్జెస్ జీఎస్టీ మరియు టాక్స్ అని బాధితుని వద్ద నుంచి పలు దఫాలుగా 44,000/- రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.● చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇంస్టాగ్రామ్ లో దాని ఫైనాన్స్ అని ఆడ్ చూసి అప్లై చేశాడు.

తర్వాత సస్పెక్ట్ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి బాధితునికి లక్ష రూపాయల లోన్ ఇస్తామని చెప్పి అప్లికేషన్ చార్జెస్ అని ఇన్సూరెన్స్ చార్జెస్ అని రిఫండ్ చార్జెస్ అని వ్యక్తితో మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.తద్వారా బాధితుడు 21000/- నష్టపోయాడు.

వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఇంస్టాగ్రామ్ లో తన సమీప బంధువు ప్రొఫైల్ పిక్చర్ తో న్యూ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.బాధితుడు తన నిజమైన బంధువు అని భావించి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
గంజాయి కి అలవాటు పడ్డ ఇద్దరు యువకుల అరెస్ట్

అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని గూగుల్ పే చేయమని అన్నోన్ నెంబర్ సెండ్ చేశాడు.బాధితుడు అది నిజమని నమ్మి 6500 సెండ్ చేశాడు తర్వాత అది ఫ్రాడ్ అని తెలిసి మోసపోయాడు.

Advertisement

వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నం నెంబర్ నుంచి వాట్సప్ కి పార్ట్ టైం జాబ్స్ అని మెసేజ్ వచ్చింది.సైబర్ నేరస్థుడు బాధితునితో వాట్సప్ లో చాట్ చేస్తూ ఒక వెబ్సైట్ బ్లూ లింక్ షేర్ చేశాడు.

టెలిగ్రామ్ యాప్ ద్వారా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేటాస్కులు కంప్లీట్ చేయాలి.మొదట చిన్న టాస్కులకి బాధితునికి అమౌంట్ వచ్చింది.

తర్వాత టాస్కులు పెంచుకోవడం వల్ల బాధితునికి ఎటువంటి అమౌంట్ రాలేదు.బాధితుడు అది సైబర్ ప్రాడని గమనించాడు.

ద్వారా బాధితుడు 1,14,000/- నష్టపోయాడు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-

• మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.

• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రకటనలను నమ్మకండి.

• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.

• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

Latest Rajanna Sircilla News