సీఎల్పీ నేత భట్టికి సంఘీభావం తెలిపిన బండ్ల గణేష్...!

సూర్యాపేట జిల్లా: తెలంగాణ ప్రజల భవిష్యత్ కొరకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండుటెండల్లో పాదయాత్ర చేస్తున్నారని,ఆయనకు తన మద్దతు, సంఘీభావం తెలిపేందుకే సూర్యాపేటకు వచ్చానని సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేష్ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ఆయన కనిపించి, ప్రెస్ మీట్ ముగుసే వరకు అక్కడే ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ నుంచి అలుపెరగకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్ కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తూ,తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేందుకు భట్టి శ్రమిస్తున్నారని, ఆయనకు మద్దతుగా నిలవాల్సిన బాద్యత మనందరి మీదా ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ల కింద బానిసలుగానే ఉండేవాళ్ళమని గుర్తు చేశారు.

Bandla Ganesh Expressed Solidarity With CLP Leader Bhatti, Bandla Ganesh , CLP B

ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని,కర్ణాటక నుండి కాంగ్రెస్ హుదూద్ తుఫాన్ మొదలైందని,తెలంగాణ నుండి గెలుచుకుంటూ, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని,150 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు.

Advertisement

Latest Suryapet News