యాదాద్రి భువనగిరి జిల్లా: ఈ నెల 30న భువనగిరి పట్టణంలో జరిగే ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) జిల్లా 8వ మహాసభలకు యువతీ, యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పివైఎల్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ పిలుపునిచ్చారు.ఆదివారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువత పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని అన్నారు.
నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక తప్పుడు ధోరణులతో తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో యువశక్తిని ఉపయోగించి దేశ భవిష్యత్తును,దేశ అభివృద్ధిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన పాలకులు పెట్టుబడుదారులకు, ప్రైవేటు సంస్థలకు దేశాన్ని నిలువునా అమ్ముతున్నారన్నారని ఆరోపించారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జిల్లాలో ఉన్న యువత ఐక్యతను ప్రదర్శించడం కోసం ఈ మహాసభలను ఉపయోగించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోబోతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్)జిల్లా ఉపాధ్యక్షుడు గుండు నరేందర్ బాబు,ప్రశాంత్, ప్రవీణ్,ఆర్.
ఉదయ్, సంతోష్,మున్నా,ఉదయ్, అనిల్,కిశోర్ తదితరులు పాల్గొన్నారు.







