బాలినేని కౌంటర్ :  చెవిరెడ్డి అవి బయటపెట్టమంటారా ? 

వైసిపి కీలక నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ,( Chevireddy Bhaskar Reddy ) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి( Balineni Srinivas Reddy ) మధ్య మాటల యుద్ధం గత కొద్ది రోజులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు .

ఈ నేపథ్యంలో లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మెప్పు పొంది ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకే అలా మాట్లాడారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారని,  మంత్రి పదవిని వదులుకుని జగన్( Jagan ) పార్టీలోకి వచ్చిన తాను ఎమ్మెల్సీ పదవ కోసం ఎందుకు పాకులాడుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

సెబితో ఒప్పందం వ్యవహారంపై అప్పట్లో జరిగింది జరిగినట్లు నిజాలు చెప్పానని తనపై ఉద్దేశపూర్వకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదు అని తాను అంటే.  విమానంలో రష్యాకు వెళ్లావు కదా , అది స్వేచ్ఛ కాదా అని చెవిరెడ్డి అంటున్నారు .మిత్రులతో కలిసి రష్యాకు వెళ్లడం,  మంత్రిగా స్వేచ్ఛనా ? అలాగైతే చెవిరెడ్డి ఎన్నిసార్లు అమెరికా వెళ్ళలేదు అక్కడ ఆయన ఏం చేసేవారో బయట పెట్టమంటారా అంటూ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వైసిపి ప్రభుత్వం హయాంలో సెఖీ తో చేసుకున్న ఒప్పందంలో తనకు అనువంతైన సంబంధం లేదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Advertisement

క్యాబినెట్ ముందుకు పంపిన ఫైల్ లలో తన డిజిటల్ సంతకం పైన అనుమానంగా ఉందని అన్నారు.ఆ ఒప్పందం గురించి సంబంధిత శాఖ మంత్రినైన తనతో ఎప్పుడైనా చర్చించారా అని జగన్ ప్రశ్నించారు.

అప్పట్లో మంత్రివర్గంలో ఎవరికి స్వేచ్ఛ ఉండేది కాదు.మొత్తం సీఎంవోనే నడిపించేది. 

చివరకు సీఎండీలను నియమించినా, ఒక్క ఫైల్ కూడా విద్యుత్ శాఖ మంత్రిగా నా దగ్గరకు రాలేదు.సీఎంఓలో పెత్తనం అంతా ఓ కాంట్రాక్టర్ దే .దీని గురించి జగన్ కు చెప్పినా పట్టించుకోలేదు .కాంగ్రెస్ లో మంత్రి పదవి( Minister Seat ) వదులుకుని జగన్ పార్టీలో చేరాను.అప్పుడు చెవిరెడ్డి ఎక్కడ ఉన్నారు ?  ఇప్పుడు పార్టీలో ఆయన ఏ స్థాయికి ఎదిగారు ? చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేస్తామనడం ఏంటని సజ్జల దగ్గర అభ్యంతరం తెలిపితే ప్రకాశం జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త,  ఎంపీ మిధున రెడ్డిని నియమించిన మరుసటిరోజే , ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించారు.చెవిరెడ్డి వద్దన్నారని తీసేశారట.

వైసీపీలో జగన్ తర్వాత స్థానంలో ఉండే పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి లనే పక్కన పెట్టించే స్థాయికి చెవిరెడ్డి వచ్చారు.  రాజశేఖర్ రెడ్డి కుటుంబం ద్వారానే రాజకీయంగా వచ్చామని చెవిరెడ్డి చెబుతున్నారు.

గుట్ట పైఅంచు నుంచి సముద్రంలోకి దూకాడు.. అతడి బాడీకి ఏమైందో చూస్తే వణికిపోతారు!
జగన్ అరెస్ట్ కు షర్మిల డిమాండ్ .. వైసీపీ కౌంటర్ ఇదే 

వైఎస్ కుటుంబం పై అంత గౌరవం ఉంటే విజయమ్మ , షర్మిల పై  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు