ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బేబీ ఒకటి కాగా ఈ సినిమాలో ప్రధాన నటీనటుల అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.ఆనంద్ దేవరకొండ,( Anand Deverakonda ) వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్( Viraj Ashwin ) తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.
ప్రధాన నటీనటుల నటన అద్భుతంగా ఉండటం వల్లే ఈ సినిమా సక్సెస్ సాధించిందని చాలామంది భావిస్తారు.
బేబీ సినిమా( Baby movie ) డైరెక్టర్ సాయి రాజేశ్ కు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం దక్కగా ఆనంద్, వైష్ణవి, విరాజ్ లకు మాత్రం తక్కువగానే పారితోషికం దక్కింది.ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండకు 80 లక్షల రూపాయల పారితోషికం దక్కిందని వైష్ణవి చైతన్య 30 లక్షల రూపాయల పారితోషికం తీసుకోగా విరాజ్ అశ్విన్ 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు ఇచ్చిన పారితోషికం వైష్ణవికి సరిపోలేదని రాబోయే రోజుల్లో ఆమెకు మరింత పారితోషికం ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తుండగా ఆ టాక్ లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.వైష్ణవి చైతన్యకు వరుస ఆఫర్లు వస్తుండగా ఈ ఆఫర్లు వైష్ణవి రైంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైష్ణవికి తర్వాత సినిమాలతో సైతం విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.బేబీ మూవీ ఫుల్ రన్ లో మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టైర్2, టైర్3 సిటీలలో కూడా బేబీ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి.ఎన్నో ప్రత్యేకతలు ఉండటం వల్లే బేబీ సినిమా సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బేబీ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.