కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండల పరిధిలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పగడపల్లికి చెందిన కృష్ణవేణి శనివారం తెల్లవారుజామున కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

ఉగాదికి ఇంటికి వెళ్లి కృష్ణవేణి శుక్రవారం సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు వచ్చి రాత్రి తల్లి కూతురు హాస్టల్ గదిలోనే ఉన్నారు.

తెల్లవారు జామున తల్లి రూంలో ఉండగానే కళశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.కళాశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు చిలుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

B.Tech Student Died By Jumping From College Building, B.Tech Student Died , Coll

Latest Suryapet News