ప్రకాశం జిల్లాలో దారుణం.. 11 ఏళ్ల బాలికకు వాతలు పెట్టిన మహిళ

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది.తన ఐదేళ్ల కూతురికి ముద్దు పెట్టిందని 11 ఏళ్ల బాలికకు వాతలు పెట్టింది ఓ మహిళ.

ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటు చేసుకుంది.తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఆడుకోవడానికి వచ్చిన బాలిక ఇంటికి సమీపంలో ఉన్న ఐదేళ్ల చిన్నారిని ముద్దాడింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఐదేళ్ల పాప తల్లి బాలికను కట్టేసి వాతలు పెట్టింది.బాధిత బాలిక కేకలు వేయడంతో వచ్చిన స్థానికులు విడిపించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

Latest Latest News - Telugu News