ఆటలో అణిముత్యాలు

నల్లగొండ జిల్లా:అండర్-17 బాలికల జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు.

ఈ నెల 18 నుండి 22 వరకు అస్సాం రాష్ట్రం గౌహతిలో జరిగే అండర్-17 బాలికల జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలలో వారిద్దరూ ప్రాతినిధ్యం వహించనున్నారు.

తిరుమల సిరి,గునుగుంట్ల మహేశ్వరి జాతీయ జట్టుకు ఎంపికైనట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలియజేశారు.తిరుమల సిరి నల్గొండ పట్టణంలోని పాతబస్తీ మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇటీవలనే పదవ తరగతి పూర్తి చేసిందని,చత్రపతి శివాజీ ఫుట్ బాల్ క్లబ్ లో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఫుట్ బాల్ కోచ్ మద్ది కర్ణాకర్ సూచనలు సలహాలతో మంచి క్రీడాకారిణిగా తయారవుతుందని,గునుకుంట్ల మహేశ్వరి సూర్యాపేట జిల్లా నడిగూడెం గురుకుల పాఠశాలలో 10వ, తరగతి చదువుతున్నదని తెలిపారు.

Atoms In The Game-ఆటలో అణిముత్యాలు-Nalgonda-Telugu

రాష్ట్ర జట్టు ఎంపికలో నల్లగొండ జిల్లాకు చెందిన క్రీడాకారులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ పక్షాన తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.పి.ఫల్గుణకి కృతజ్ఞతలు తెలియజేశారు.

పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల
Advertisement

Latest Nalgonda News