ఆత్మకూర్(ఎస్)ఎంఈఓ ధారా సింగ్ సస్పెండ్

సూర్యాపేట జిల్లా:విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)ఎంఈఓధారా సింగు( MEO Dhara Singh )ను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సస్పెండ్ చేసిన ఘటన ఆలస్యంగా ప్రకటించారు.

గత నెల 28న జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయగా విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదని ఫిర్యాదు రావడంతో ఆయన ఎంఆర్సీ భవనాన్ని తనిఖీ చేశారు.

ఆ సమయంలో ఎంఆర్సీ భవనంలో యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు ఉండటంతో విద్యార్థులకు అందించడంలో ఎంఈఓ నిర్లక్ష్యం వహించాడంటూ ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలని డిఓకు ఆదేశాలు ఇచ్చారు.కాగా సస్పెండ్ ఆర్డర్ ను నేటి వరకు బహిర్గతం చేయని అధికారులు సస్పెండ్ చేసినట్లు శనివారం విలేకరులకు సమాచారం ఇచ్చారు.

Atmakur(S) MEO Dhara Singh Suspended , Atmakur(S) , MEO Dhara Singh , Suryapet
కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ

Latest Suryapet News