అరబ్ షేక్ ఆఫర్: ప్రముఖ మోడల్ కు పెళ్లి చేసుకుంటే రూ.4 కోట్లు..!

సాధారణంగా పెళ్లి అంటేనే వరుడు, వధువు కలిసి సంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుంటారు.అందులో ఎవరి ఆచారాలు వారివి ఉంటాయి.

దానికి తోడు బంధువులు, స్నేహితుల హడావిడి, బాజా బజంత్రీలు ఇలా సంబరంగా జరుపుకుంటారు.అందులో భాగంగానే కట్నాలు, కానుకలు ఉండనే ఉంటాయి.

కొందరైతే ప్రేమ వివాహం చేసుకుంటారు.కానీ ఎలా పెళ్లి చేసుకున్న వధువు, వరుడు మాత్రం తప్పనిసరి.

కానీ తనను తాను పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూశారా.? పెళ్లిలో వధువు వరుడికి కట్నం ఇవ్వడం సహజం.అయితే ఎదురు కట్నం ఇవ్వడం ఎక్కడైనా చూశారా.

Advertisement

అయితే మీరు ఈ మోడల్ గురించి తెలుసుకోవాల్సిందే.బ్రెజిల్ కు చెందిన 33 ఏళ్ళ క్రిస్ గలేరా అనే ఓ మోడల్ తను ఒంటరిగా జీవించాలని నిర్ణయించు కుందేమో, వరుడు లేకుండానే తనను తాను పెళ్లి చేసుకుంది.

దానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇంకేముంది అవి కాస్త వైరల్ గా మారాయి.

దీంతో అందరూ ఆమె పెళ్లి గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసిన ఓ అరబ్ షేక్ ఆ మోడల్ కు ఆకర్షితుడయ్యాడు.

వెంటనే ఆ మోడల్ కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

ఆ మోడల్ కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.తనను క్రిస్ గలేరా పెళ్లి చేసుకుంటే రూ.4 కోట్లు ఎదురు కట్నం ఇస్తానని ప్రకటించాడు.క్రిస్ గలేరా తనకు తాను విడాకులు తీసుకుని అరబ్ షేక్ ని పెళ్లి చేసుకోవాలని కోరాడు.

Advertisement

దీంతో క్రిస్ గలేరా ప్రపోజల్ చేసిన అరబ్ షేక్ తో ఫోన్ లో మాట్లాడింది.మీరు కొనడానికి నేనేమీ ఆట వస్తువుని కాదని, తనకు నచినన్ని రోజులు ఒంటరిగా గడుపుతానని ఆమె సున్నితంగా అరబ్ షేక్ ​ప్రపోజల్ ను ​తిరస్కరించింది.

తాజా వార్తలు