కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, తెలంగాణ మాడల్ పాఠశాలలు కె.జి.

బి.వి.పాఠశాలల్లో (61 పాఠశాలలు) తాత్కాలిక పద్ధతిన కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాధికారి రమేష్ కుమార్( Ramesh Kumar ) ఒక ప్రకటనలో పేర్కన్నారు.గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ , కంప్యూటర్ డిగ్రీ , టెక్నికల్ కోర్స్ (రిలేటెడ్ టూ కంప్యూటర్స్ ) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టు కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అన్నారు.

Applications Are Invited For The Post Of Computer Instructor , Rajanna Sirisill

సి లాంగ్వేజ్ , హెచ్టిఎమ్ ఎల్ కోర్స్ లు చేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు.ఎంపికయిన వారు వారానికి 8 నుండి 10 గంటలు తరగతి గదులలో బోధించుటకు, పనిచేయవలసి ఉంటుందన్నారు.

అర్హత , ఆసక్తి గల అభ్యర్ధులు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలను( Educational Qualification ) అప్లికేషన్ ను జత చేసి ఈ నెల 7 వ తేదీ లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునందు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రకటనలో తెలిపారు.

Advertisement
వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!

Latest Rajanna Sircilla News