గమ్యం, వేదం, కంచే వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు క్రిష్ జాగర్లమూడి.( Director Krish Jagarlamudi ) ఈ సినిమాలకు ఆయనే కథ అందించి, ఆయనే దర్శకత్వం వహించాడు.
ఆ సినిమాలు చూస్తే క్రిష్ ఎంత ప్రతిభవంతుడో అర్థమవుతుంది.అయితే ఈ దర్శకుడికి కాలం సరిగా కలిసి రాక రీసెంట్ మూవీస్ ఫెయిల్ అయ్యాయి.
ఇక ఇలాంటి డెస్టినీనే అగ్రతార అనుష్క శెట్టి( Anushka Shetty ) కూడా ఫేస్ చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ మంచి నటి, ఎత్తు పొడుగు, అందం దేనిలోనూ ఈ తారకు వంక పెట్టలేము.
అరుంధతి, భాగమతి, రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ వేసిన వేషాలు టాలీవుడ్ చరిత్రలోనే హైలెట్‌గా నిలిచాయి.చందమామ లాంటి గుండ్రటి ఫేస్ చూస్తే ఆమెపై ఎంతటి నికార్సైన మగవాడైనా మనసు పారేసుకోవాల్సిందే.

ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల ఈ మంగళూరు తార తెలుగు, తమిళ భాషా సినిమాల్లో ఎక్కువగా నటించింది.కానీ కన్నడలో ఇప్పటిదాకా ఏ మూవీ చేయలేదు.ప్రస్తుతం మలయాళంలో “కథనార్” అనే సినిమా చేస్తోంది.ఈ అందాల తార కెరీర్ “సైజు జీరో”( Size Zero Movie ) అనే ఒక సినిమా వల్ల చాలా దెబ్బతిన్నది.
ఈ ముద్దుగుమ్మ బాడీ షేమింగ్ కి గురయ్యే ఆడవారి కోసం దీనిని తీసినట్లు ఉన్నారు.అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది.ఈ మూవీ కోసం లావుగా తయారైన అనుష్క మళ్లీ ఇంతకు ముందులాగా నాజుగ్గా తయారు కాలేకపోయింది.ఆమె బొద్దుగా ఉండటం వల్ల ప్రేక్షకులకు ఆమెపై ఇంట్రెస్ట్ తగ్గింది.
అయినా ఆమె మంచి పాత్రలు నేర్చుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.ఇటీవల రిలీజ్ అయిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”తో( Miss Shetty Mr Polishetty ) ఆకట్టుకుంది.

ఇక అనుష్క వయసు 42 ఏళ్ళు, డైరెక్టర్ క్రిష్ వయసు 45 ఏళ్లు.వీరిద్దరూ ఒకప్పుడు భారీ సక్సెస్ లు అందుకున్న వారే.ఇప్పుడు మాత్రం ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నారు.అలా దాదాపు సేమ్ సిచువేషన్ లో ఉన్న వీరు ఇప్పుడు కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు.క్రిష్ ఒక హీరోయిన్ సెంట్రిక్ మూవీ తీస్తుండగా అందులో అనుష్క మెయిన్ రోల్ ప్లే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అనుష్క ఎప్పుడూ మంచి సినిమాలనే ఎంపిక చేసుకుంటుంది.
క్రిష్ కూడా కొత్త కాన్సెప్టులను పరిచయం చేస్తుంటాడు.కాబట్టి వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించవచ్చు.
చూద్దాం మరి ఏం జరుగుతుందో!