నేరేడుచర్లలో మరో సైబర్ క్రైమ్

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో గతంలో ఓ పెట్రోల్ బంక్ యజమానికి స్థానిక ఏఎస్ఐ పేరుతో కాల్ చేసి డబ్బులు కాజేసిన సైబర్ క్రైమ్ ఘటన మరవక ముందే మళ్ళీ అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.పట్టణానికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి రాగిరెడ్డి గోపాల్ రెడ్డికి శనివారం వీడియో కాల్ చేసి జియో కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి,ఫోన్ హ్యాక్ చేసి అతని పాస్వర్డ్ తెలుసుకుని అతని నుండి రూ.

1,70,000 కాజేసిన సైబర్ కేటుగాళ్లు.వ్యాపార ఎకౌంటు నుంచి రూ.1,50,000,పర్సనల్ అకౌంట్ నుంచి రూ.20 వేలు కాజేయడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గతంలోనూ నేరేడుచర్లలో బ్యాంకుల నుండి ఫోన్ చేస్తున్నామని,ఇతర వ్యాపారాల నుండి ఫోన్ చేస్తున్నామని ఓటీపీ నెంబర్లు అడిగి మరి డబ్బులను కొట్టేసిన సంఘటనలు ఉన్నాయి.

Another Cybercrime In Nereduchar , Nereduchar, Cybercrime-నేరేడుచ�

దీనితో అపరిచిత ఫోన్ కాల్స్,వాట్సప్ మెసేజ్ లను నమ్మవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా,ఏదో ఒక సందర్భంలో ఇలా జరుగుతు ఉండడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున ఆందోళన గురవుతున్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News