అంగన్వాడి కేంద్రంలో ఎనిమియ నిర్ధారణ పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పోషణ్ మాసం లో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడి 3 కేంద్రంలో ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఏఎన్ఎం ఉషారాణి గర్భిణీలకు, బాలింతలకు, ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు.

అనంతరం అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు అంగన్వాడి కేంద్రం ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అంగన్వాడీ కేంద్రంలో దొరికే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలని,ప్రతినెల పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు.

రక్త శాతం తక్కువ ఉన్న వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త కన్నం లత తదితరులు ఉన్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Advertisement

Latest Rajanna Sircilla News