రాజన్న సిరిసిల్ల జిల్లా :అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని తమకు కొత్త కాదని మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి ప్రెస్ నోట్లో హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం పూర్తిస్థాయిలో రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేయాలని గురువారం ప్రజాభవన్ ముట్టడికి తమ పార్టీ ఆదేశాలు ఇవ్వగా పోలీసులు ముందుకు ముందుగానే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగ పోరాట ఉద్యమాన్ని జేస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని తెల్లవారక ముందే అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదన్నారు.
అక్రమ అరెస్టులకు భయపడేది లేదని రైతుల గురించి పోరాటం చేస్తామని తెలిపారు.







