రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రపంచ వెదురు దినోత్సవన్ని పురస్కరించు కొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో వెదురు బొంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వరకు మేధర్లు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తాసిల్దార్ పుష్పలతకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని మేదర్లను ఎస్టీ జాబితా లో చేర్చాలని అన్నారు.
మేదరి బంధు పథకం అమలు చేయాలని వెదురు రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.మేదరులకు 5 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వ కార్యాలయంలో వెదురు ఉత్పత్తులు వాడకాన్ని ప్రోత్సహించాలని,మండల మేదరి సంఘం భవనానికి ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని,50 సంవత్సరాల నిండిన వారికి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుల్ల బాలయ్య, గౌరవాధ్యక్షులు గుల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు రఘు నాయకులు మహేష్ ,నరేష్, దేవయ్య, గంగరాము, శ్రీనివాస్, బుచ్చయ్య, భీమయ్య,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







